Share News

టీఎంసీలో 50 మంది ఎమ్మెల్యేల వేరుకుంపటి?

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:57 AM

టీఎంసీ నుంచి గెలుపొందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమై.. వేరుకుంపటి పెట్టుకోవాలని...

టీఎంసీలో 50 మంది ఎమ్మెల్యేల వేరుకుంపటి?

  • తామే అసలైన పార్టీగా ప్రకటించుకునే చాన్స్‌

కోల్‌కతా, జూన్‌ 2: టీఎంసీ నుంచి గెలుపొందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమై.. వేరుకుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నుంచి సస్పెండైన రిజు దత్తా మంగళవారం వెల్లడించారు. అంతేకాదు.. తామే ఎక్కువ మందిమి ఉన్నందున తమదే అసలైన టీఎంసీగా ప్రకటించుకోనున్నట్లు సమాచారం. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం 80 మందిలో 53 మంది ఎమ్మెల్యేలు చీలిపోతే.. వారిపై అనర్హత వేటు పడదు. గతంలో మహారాష్ట్రలో శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుని తమదే అసలైన శివసేనగా ప్రకటించుకోవడం.. ఎన్నికల కమిషన్‌ కూడా దీనికి ఆమోదముద్ర వేయడం తెలిసిందే. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా ఇదే విధంగా చీలిపోయింది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:57 AM