Share News

అత్యాచార ఆరోపణలు.. టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్

ABN , Publish Date - Nov 09 , 2026 | 07:17 PM

అత్యాచార ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎమ్మెల్యే పరేష్‌రామ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అత్యాచార ఆరోపణలు.. టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్
TMC MLA Pareshram Das

కోల్‌కతా, నవంబర్ 09: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎమ్మెల్యే పరేష్‌రామ్ దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కుతుండగా ఆయనను బరుయిపూర్ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 17 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ముంబై వెళ్లేందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు.


దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కానింగ్ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే దాస్‌పై అత్యాచారం, బెదిరింపులు, దోపిడీ తదితర కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.


2023 పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి మరో కేసులో ఎమ్మెల్యే దాస్ గతంలో సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారుల విచారణలో ఆయన సరిగ్గా స్పందించ లేదు. ఈ నేపథ్యంలో మరోసారి.. అక్టోబర్ చివరి వారంలో తమ విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యే దాస్‌కు సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.


ఈ విచారణకు దాస్ హాజరుకాలేదు. దీంతో కానింగ్‌లోని ఆయన నివాసంలో పోలీసు బృందాలు సోదాలు జరిపాయి. ఈ సందర్భంగా నలుగురు టీఎంసీ నేతలను అరెస్ట్ చేశారు. కానీ ఎమ్మెల్యే దాస్ ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు సోమవారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. జనవరిలో మోగనున్న నగారా!

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

Read Latest National News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 07:42 PM