కుండపోత వర్షాలు.. పుణేలో కూలిన మూడు అంతస్తుల భవనం..
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:49 PM
పుణేలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అధికారుల సమాచారం ప్రకారం, భవనం కూలిన సమయంలో అందులో ఉన్న 15 నుంచి 16 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో పుణేలో కూడా భారీ వర్షాల కారణంగా ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలి తీవ్ర కలకలం రేపింది. మోషి ప్రాంతంలోని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌లోని మూడు అంతస్తుల కార్యాలయ భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది.
అధికారుల సమాచారం ప్రకారం, భవనం కూలిన సమయంలో అందులో ఉన్న 15 నుంచి 16 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పీసీఎంసీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు.
Also Read:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఆటోలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. కాసేపటికే..