టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:34 AM
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు చుక్కెదురైంది. యాప్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని జస్టిస్ తేజస్ కారియా తేల్చి చెప్పారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అక్రమ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి టెలిగ్రామ్ ప్రధాన సాధనంగా మారిందని అన్నారు. అనుమానాస్పద ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు టెలిగ్రామ్‌కు సూచించామని అన్నారు. అయినప్పటికీ కంపెనీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పారు.
మరోవైపు, టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపిస్తూ ఎమర్జెన్సీ అధికారలతో నిషేధం విధించడాన్ని కేంద్రం సమర్థించుకోజాలదని అన్నారు. సంబంధిత కంటెంట్‌ను మాత్రమే బ్లాక్ చేయకుండా మొత్తం యాప్‌పై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందో వివరించలేదని పేర్కొన్నారు. కేవలం నీట్ పరీక్షతో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు. అయితే, కోర్టు కేంద్రం వాదనలను సమర్థించింది. సెక్షన్ 69ఏ కింద ఒక డిజిటల్ వేదికను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. నిషేధం ఎత్తివేత కోరుతూ టెలిగ్రామ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. జూన్ 22 వరకూ కేంద్రం టెలిగ్రామ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి..
ఉగ్రవాదం, సైబర్ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం: కేంద్రం