Share News

పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి..

ABN , Publish Date - Jun 19 , 2026 | 07:57 AM

ట్రెక్కింగ్ సరదా అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ట్రెక్కింగ్ చేస్తుండగా ఓ యువకుడు కాలు జారి లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది.

పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి..
Lonavala Trekking Accident

ముంబై, జూన్ 19: ఆ యువకుడు తన పుట్టినరోజు వేడుకలను మరింత సంతోషంగా జరుపుకోవాలని అనుకున్నాడు. మిత్రులతో కలిసి కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అయితే, ట్రెక్కింగ్ సరదా అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ట్రెక్కింగ్ చేస్తుండగా ఆ యువకుడు కాలు జారి లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె జిల్లాలోని గహుంజేకు చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ అనే యువకుడు గురువారం 24వ పడిలోకి అడుగుపెట్టాడు.


నిన్న విశాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలను మరింత సంతోషంగా మార్చాలని విశాల్ భావించాడు. మిత్రులతో కలిసి లోనావాలాకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. కొండల్లో ట్రెక్కింగ్ చేస్తుండగా అనుకోని విషాదం చోటుచేసుకుంది. లోహగడ్ వద్ద కాలు జారి లోయలో పడిపోయాడు. విశాల్ స్నేహితులు.. పోలీసులు, రెస్క్యూ టీమ్‌‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. లోయలో తీవ్రగాయాలతో పడి ఉన్న విశాల్‌ను గుర్తించారు.


అతడిని హుటాహుటిన దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. విశాల్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు. విశాల్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

మూకుమ్మడిగా ఫోన్లు పగులగొట్టిన నేరస్థులు.. కారణమేంటో తెలిస్తే..

Updated Date - Jun 19 , 2026 | 08:03 AM