దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలి
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:57 AM
దివ్యాంగులకు కేవలం ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయడమే కాకుండా.. వారు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించడమే నిజమైన ‘సుగమ్య భారత్’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
జాతీయ సదస్సులో మంత్రి అడ్లూరి
న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు కేవలం ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయడమే కాకుండా.. వారు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించడమే నిజమైన ‘సుగమ్య భారత్’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. దివ్యాంగుల భాగస్వామ్యం, సాధికారతతోనే సమ్మిళిత అభివృద్థి సాధ్యమవుతుందని, అదే వికసిత భారత్-2047కు పునాది కావాలని పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సులో ‘సుగమ్య భారత్ - వికసిత భారత్’ అంశంపై తెలంగాణ అనుభవాలు, క్షేత్రస్థాయి సవాళ్లు, కార్యాచరణ ప్రతిపాదనలను మంత్రి వివరించారు. దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర విధానాల అమలుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కొన్ని కీలక సూచనలు చేశారు. సదుపాయాలను మెట్రో నగరాలు, విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితం చేయకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీ కార్యాలయాల్లోనూ కల్పించాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లు దృష్టి, వినికిడి లోపాలున్న వారికి సులభంగా అందుబాటులో ఉండేలా మార్చాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు