తమిళనాడులో 234 స్థానాలకూ..
ABN , Publish Date - Apr 23 , 2026 | 06:10 AM
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుంది. బరిలో నిలిచిన 4,023 మంది...
చెన్నై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుంది. బరిలో నిలిచిన 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనున్న ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి బుధవారం సాయంత్రమే పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,06,418 ఈవీఎంలను వినియోగించనున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు, టీవీకే పార్టీల మఽధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న అంచనాలతో సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ముదస్తు చర్యలు చేపట్టింది. మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాల్లో 5,949 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. దాదాపు 1.5 లక్షల మంది భద్రతా బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International