అలా అయితే.. కూటమికి గుడ్ బై!
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:20 AM
తమిళనాడు సీఎం విజయ్ భవిష్యత్తులో ప్రధాని కూడా అవుతారంటూ అధికార టీవీకే శ్రేణులు చేస్తున్న ప్రచారం కూటమి ప్రభుత్వంలో...
ప్రధాని అభ్యర్థిగా విజయ్‌కు
మద్దతిస్తే రాష్ట్రంలో కలిసి ఉండం
టీవీకేకు కాంగ్రెస్ హెచ్చరిక
చెన్నై, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ భవిష్యత్తులో ప్రధాని కూడా అవుతారంటూ అధికార టీవీకే శ్రేణులు చేస్తున్న ప్రచారం కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి టీవీకే ప్రచారం మంటపుట్టిస్తోంది. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని, ఆయనకు మద్దతు ఇవ్వకుండా విజయ్‌కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ‘‘ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌కు మద్దతు తెలపకపోతే.. కూటమి నుంచి వైదొలుగుతాం. మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం.’’ అని కాంగ్రెస్ నేత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాజేశ్‌కుమార్ హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ పడేది లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి