ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ
ABN , Publish Date - Jul 01 , 2026 | 09:44 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' (VB-G RAM G) యాక్ట్, 2025లో కొన్ని సవరణలు చేయాలని సీఎం విజయ్ ఆ లేఖలో ప్రధానికి సూచించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' (VB-G RAM G) యాక్ట్, 2025లో కొన్ని సవరణలు చేయాలని సీఎం విజయ్ ఆ లేఖలో ప్రధానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే గృహ నిర్మాణ పథకాలను కూడా ఈ కొత్త ఉపాధి హామీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. వేతనాలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను కేంద్రం భరించాలని పేర్కొన్నారు. నిర్మాణాలకయ్యే ఖర్చులను 75:25 నిష్పత్తిగా మార్చాలని చెప్పారు.
అలాగే ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో పంటలు వేసే, కోసే 60 రోజుల పీక్ వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రకటించాలి. ఆ సమయంలో ఉపాధి పనులను నిలిపివేయాలి. అయితే, ఎల్‌నినో వంటి వాతావరణ మార్పుల వల్ల ఈ సీజన్లు మారుతుంటాయని సీఎం విజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకే బదిలీ చేయాలని విజయ్ ఆ లేఖలో ప్రధానిని కోరారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్
మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త