Share News

విజయ్‌-సంగీత విడాకుల కేసు వాయిదా

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:59 AM

టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌, సంగీత దంపతుల విడాకుల కేసు విచారణను చెంగల్పట్టు...

విజయ్‌-సంగీత విడాకుల కేసు వాయిదా

చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌, సంగీత దంపతుల విడాకుల కేసు విచారణను చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ 2025 డిసెంబరు 24న సంగీత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ఈ కేసు సోమవారం మరోమారు విచారణకు వచ్చింది. తమ క్లైయింట్స్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతివ్వాలని ఇరువైపులా న్యాయవాదులు కోరారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌కు అవసరమైన ఈమెయిల్‌ ఐడీ, ఇతర దరఖాస్తులను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 04:59 AM