ఎమ్మెల్యేలకు కొత్త కార్లు
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:32 AM
తమిళనాడులోని ప్రతి ఎమ్మెల్యేకు ఒక ప్రభుత్వ వాహనం ఇవ్వడంతో పాటు...దాని నిర్వహణ, ఇంధన ఖర్చులకు నెలకు రూ.75 వేలు, ఎమ్మెల్యే సహాయకుడి కోసం నెలకు రూ.25 వేలు...
నిర్వహణకు రూ.75 వేలు: తమిళనాడు సీఎం విజయ్
చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని ప్రతి ఎమ్మెల్యేకు ఒక ప్రభుత్వ వాహనం ఇవ్వడంతో పాటు...దాని నిర్వహణ, ఇంధన ఖర్చులకు నెలకు రూ.75 వేలు, ఎమ్మెల్యే సహాయకుడి కోసం నెలకు రూ.25 వేలు భత్యం ఇవ్వనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంగ, ఆర్థికబలం లేని చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, వారందరికీ వాహనాలు సమకూర్చాలని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు జ్యోతిమణి చేసిన సూచనతో తాను ఏకీభవిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం తరఫున వాహనంతో పాటు ఇతర సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త కార్లను అందిస్తుందని ప్రకటించినందుకు టీవీకే ఎమ్మెల్యే షణ్ముగం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇన్నోవా కొనిస్తే సౌలభ్యంగా ఉంటుందని, ఎమ్మెల్యేలంతా ఇదే చెప్పుకుంటున్నారనడంతో సీఎం సహా సభికులంతా పెద్దపెట్టున నవ్వారు.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..