డీఎంకే నేతల అవినీతి వివరాలు నా దగ్గర ఉన్నాయి: సీఎం విజయ్
ABN , Publish Date - Aug 19 , 2026 | 03:31 PM
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు.
చెన్నై, ఆగస్టు 19: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండు ఫైల్స్ తన టేబుల్‌పైనే ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి.. ఆ ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
డీఎంకే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే పార్టీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ప్రజలు మాపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఉప ఎన్నికల సమయంలో నేను మాట్లాడతాను. ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన
డయాబెటిస్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమా?