Share News

పోక్సో కేసు.. ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన స్వామి అవిముక్తేశ్వరానంద

ABN , Publish Date - Feb 24 , 2026 | 02:44 PM

చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో జ్యోతిర్‌మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నారు.

పోక్సో కేసు.. ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన స్వామి అవిముక్తేశ్వరానంద
Swami Avimukteshwarananda Saraswati

ప్రయాగరాజ్: చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో జ్యోతిర్‌మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి (Swami Avimukteshwaranand Saraswati) అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన తరఫున న్యాయవాదులు రాజర్షి గుప్తా, సుదాన్షు కుమార్, శ్రీ ప్రకాష్‌ ఈ పిటిషన్ వేశారు.


అవిముక్తేశ్వరానందపై తులసి పీఠాదీశ్వర్ స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి సెక్షన్ 173(4) కింద జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. గురుసేవ పేరుతో గురుకులంలోను, మాఘమేళాలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు విచారణ జరిపిన పోక్సో ప్రత్యేక కోర్టు ఏడీజే వినోద్ కుమార్ చౌరాసియా దీనిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ప్రయాగరాజ్‌లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్‌ అధికారులను ఇటీవల ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అవిముక్తేశ్వరానంద, ఆయన శిష్యుడు ముకుందానంద్ గిరి, మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై ఝాన్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. అయితే ఇది తప్పుడు కేసని అవిముక్తేశ్వరానంద తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో 'షర్ట్‌లెస్' నిరసనపై పోలీసుల చర్య.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

Updated Date - Feb 24 , 2026 | 02:47 PM