Share News

ప్రణబ్‌ సూచనతోనే తృణమూల్‌ను వీడాను

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:10 AM

భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ దివంగత నేత ప్రణబ్‌ ముఖర్జీ సూచనతోనే తాను తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు

ప్రణబ్‌ సూచనతోనే తృణమూల్‌ను వీడాను
suvendhu

  • బెంగాల్‌ సీఎం సువేందు అధికారి వెల్లడి

కోల్‌కతా, నవంబరు 25: భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ దివంగత నేత ప్రణబ్‌ ముఖర్జీ సూచనతోనే తాను తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. ప్రణబ్‌ తనకు మార్గదర్శకుడని, తృణమూల్‌ను వీడాలని తనకు ఆయనే సూచించారని పేర్కొన్నారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో సువేందు మాట్లాడుతూ, ‘‘ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాక ఓసారి ఆయన వద్దకు వెళ్లి కలిశాను. అప్పుడు ఆయన నాకు ఒక సూచన చేశారు. టీఎంసీలో కొనసాగితే ఉద్యోగిగానే ఉండిపోతావని, రాజకీయంగా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే మోదీతో కలిసి ముందుకు సాగాలని చెప్పారు’’ అని సువేందు వెల్లడించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ను.. మేనత్త మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆధిపత్యంలో నడిచే ప్రైవేటు కంపెనీగా ప్రణబ్‌ అభివర్ణించారని తెలిపారు. అయితే ప్రణబ్‌ ఇప్పుడు మన మధ్య లేనందున.. ఈ అంశంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తే వివాదం తలెత్తే అవకాశం ఉందన్నారు. తాను ఆయన మాటల్లోని విషయాన్ని అర్థం చేసుకొని తృణమూల్‌ను వీడానని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

Updated Date - Nov 26 , 2026 | 07:05 AM