Share News

సువేందు పీఏ హత్యపై సిట్‌ ఏర్పాటు

ABN , Publish Date - May 08 , 2026 | 04:05 AM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా పశ్చిమబెంగాల్‌లో హింస కొనసాగుతోంది. బీజేపీ సీనియర్‌ నేత సువేందు అధికారి...

సువేందు పీఏ హత్యపై సిట్‌ ఏర్పాటు

కోల్‌కతా, మే 7: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా పశ్చిమబెంగాల్‌లో హింస కొనసాగుతోంది. బీజేపీ సీనియర్‌ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ హత్యపై ఐజీ ర్యాంక్‌ అధికారితో సిట్‌ ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ప్రధాన నిందితులు మాత్రం ఇంకా పరారీలో ఉన్నారు. ఘటనకు సంబంధించి గతంలో నేరచరిత్ర ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐఏఎఫ్‌ మాజీ అధికారి అయిన చంద్రనాథ్‌ హత్యకు సుపారీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గురువారం కూడా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. కోల్‌కతా, బీర్భుమ్‌, హౌరా ప్రాంతాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. హౌరా శివపురిలో జరిగిన కాల్పులు, రాళ్లదాడుల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 04:05 AM