Share News

సహజీవనం తర్వాత కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:25 PM

సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది.

సహజీవనం తర్వాత కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court

ఢిల్లీ: సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.


పెళ్లి చేసుకోలేదని కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని ధర్మాసనం సూచించింది. తప్పుడు వాగ్దానం, విఫలమైన వాగ్దానాల మధ్య తేడాను గుర్తించాలని కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర న్యాయవాదిపై నమోదైన అత్యాచారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇద్దరి వ్యక్తుల బంధంలో ప్రారంభం నుంచీ మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

Updated Date - Apr 27 , 2026 | 05:59 PM