తమిళనాట గోవధ నిషేధ ఉత్తర్వులపై సుప్రీం స్టే
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:56 AM
బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనైనా తమిళనాట ఆవులను, దూడలను వధించడంపై నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై...
చెన్నై, జూలై 13 (ఆంధ్రజ్యోతి): బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనైనా తమిళనాట ఆవులను, దూడలను వధించడంపై నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1976 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు... రాష్ట్రవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టు గత మే 27న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ‘జంతు సంరక్షణ చట్టం 1958’కి విరుద్ధమని పేర్కొంది. పనికి, సంతానోత్పత్తికి ఉపయోగపడని, పదేళ్లు పైబడిన ఆవులను, సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం ఆధారంగా వధించడానికి ఈ చట్టం అనుమతిస్తుందని వివరించింది. ఈ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు...హైకోర్టు ఉత్తర్వుల్లో ‘సవరణ’ అవసరమని అభిప్రాయపడుతూ, ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News