Share News

ఆర్టీఐ క్రియాశీలత కొత్త వ్యాపారంగా మారింది

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:40 AM

సమాచార హక్కు చట్టం క్రియాశీలత(యాక్టివిజం) ఒక కొత్త వ్యాపారంగా మారిపోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది....

ఆర్టీఐ క్రియాశీలత కొత్త వ్యాపారంగా మారింది

  • రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్న కార్యకర్త బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం క్రియాశీలత(యాక్టివిజం) ఒక కొత్త వ్యాపారంగా మారిపోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న ఓ ఆర్టీఐ కార్యకర్తకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. పనులు పర్యవేక్షించడానికి మీరెవరంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ఒక రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారనే ఆరోపణలపై పంజాబ్‌కు చెందిన రాకేశ్‌ కుమార్‌ అనే ఆర్టీఐ కార్యకర్తపై కేసు నమోదైంది. రోడ్డు నిర్మాణ స్థలానికి వెళ్లిన రాకేశ్‌, ఆయన అనుచరుడు కలిసి అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ అధికారిని(పిటిషనర్‌), పనులు చేస్తున్న కూలీలను బెదిరించి, ఆ పనులను బలవంతంగా నిలిపివేసినట్లు ఆరోపణలున్నాయి. తనపై భౌతిక దాడికి దిగారని, అక్కడి కూలీలను కులం పేరుతో దూషించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం రాకేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆర్టీఐ యాక్టివిజం పేరుతో సాగుతున్న పర్యవేక్షణలను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పర్యవేక్షించడానికి మీరెవరని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 05:40 AM