ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదు
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:13 AM
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో పేర్లు తొలగిస్తుండడంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన...
పౌరసత్వాన్ని ఈసీ నిర్ధారించలేదు అనుమానంతో పేరు తొలగిస్తే
కేంద్రానికి ఈసీ లేఖ రాయాలి
నిర్ణయం వచ్చే దాకా ప్రస్తుత హోదానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 17: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో పేర్లు తొలగిస్తుండడంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదని వ్యాఖ్యానించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే తుది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘమేమీ కాదని స్పష్టం చేసింది. ఒకవేళ దేశ పౌరుడు కాడేమోనన్న అనుమానంతో ఎవరి పేరునైనా తొలగిస్తే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది. వారి పౌరసత్వ హోదాను నిర్ధారించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయడం ఈసీ విధి అని విస్పష్టంగా తెలిపింది. బిహార్ ‘సర్’పై ఇచ్చిన తీర్పులో ఇదే విషయాలను తెలిపామని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారు దాఖలు చేసిన పిటిషన్ల కోసం ఏర్పాటయిన అప్పిలేట్ ట్రైబ్యునళ్ల పనితీరును మెరుగుపరచాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రసేన్‌జిత్ బోస్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటరు జాబితాలో పేరు లేదన్న కారణంతో సంక్షేమ పథకాలను నిలిపివేసిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ తెలిపారు. దీనిపై జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ స్పందిస్తూ ఈసీ పౌరసత్వాన్ని నిర్ధారించే రాజ్యాంగబద్ధ సంస్థేమీ కాదని చెప్పారు. తొలగించి న వ్యక్తి హోదాపై పౌరసత్వచట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయాల్సి ఉంటుంది. అది జరిగే వరకు ఆ వ్యక్తికి ప్రస్తుతం ఉన్న హోదా కొనసాగుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు