Share News

తాత్కాలిక ఉద్యోగులూ రిటైర్మెంట్‌ ప్రయోజనాలకు అర్హులే!

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:19 AM

వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులలో కొనసాగుతున్న తేడాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒకే రకమైన పని చేసే వారి మధ్య భేద భావం...

తాత్కాలిక ఉద్యోగులూ రిటైర్మెంట్‌ ప్రయోజనాలకు అర్హులే!

  • వారికి కూడా పింఛను ఇవ్వాలి: సుప్రీం

న్యూఢిల్లీ, జూన్‌ 1: వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులలో కొనసాగుతున్న తేడాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒకే రకమైన పని చేసే వారి మధ్య భేద భావం చూపవద్దని ప్రభుత్వానికి సూచించింది. తపాలా విభాగంలో కొన్ని దశాబ్దాలపాటు పని చేసి రిటైరైన తాత్కాలిక ఉద్యోగులకు పెన్షన్‌ ప్రయోజనాలను కల్పించబోమన్న పాట్నా హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. దీర్ఘకాలంపాటు పని చేసిన తాత్కాలిక ఉద్యోగులకైనా సామాజిక భద్రత, పెన్షన్‌ ప్రయోజనాల వంటి వాటిని నిరాకరించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో పిటిషన్‌దారులకు 3 నెలల్లో పదవీ విరమణ తాలూకు ఆర్థిక ప్రయోజనాలను అందజేయాలని, జాప్యం జరిగితే ఏడాదికి ఆరు శాతం వడ్డీ చొప్పున లెక్కించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 06:19 AM