Share News

మంత్రుల నియామకంపై మార్గదర్శకాలివ్వలేం

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:50 AM

తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారిని మంత్రులుగా నియమించకుండా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) స్వీకరించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది

మంత్రుల నియామకంపై మార్గదర్శకాలివ్వలేం
SUPREMECOURT

‘పిల్‌’ను అంగీకరించని సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 6: తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారిని మంత్రులుగా నియమించకుండా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) స్వీకరించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే అది క్లిష్టమైన అంశంలోకి న్యాయస్థానం ప్రవేశించినట్టవుతుందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయయూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనాల ధర్మాసనం పరిశీలించింది. ఆరోపణల తీవ్రత, నేర స్వరూపంపై నిర్ణయాలు తీసుకునే విచక్షణను సీఎంలకే విడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపారు.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 05:51 AM