Share News

ప్రేమతో ఒక్కటైతే.. పోక్సోతో వేధింపులా?

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:00 AM

కౌమార దశలో (టీనేజ్‌) పరస్పర అంగీకారంతో ఏర్పడే ప్రేమ సంబంధాలను అణచివేయడానికి తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు...

ప్రేమతో ఒక్కటైతే.. పోక్సోతో వేధింపులా?

  • పిల్లల ఇష్టాలను అణచడానికి ఆయుధంగా వాడుతున్నారు

  • అబ్బాయిలను నేరస్థులుగా, అమ్మాయిలను బాధితులుగా చిత్రీకరిస్తున్నారు

  • 15-18 ఏళ్ల వయసు ప్రయోగాల దశ

  • ప్రేమ, సహజ ఆకర్షణలను ఎలా ఆపగలరు?

  • సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 13: కౌమార దశలో (టీనేజ్‌) పరస్పర అంగీకారంతో ఏర్పడే ప్రేమ సంబంధాలను అణచివేయడానికి తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘15-18 ఏళ్లు అన్నది ప్రయోగాలు చేసే (కొత్తవి తెలుసుకోవాలి, చేయాలన్న) వయసు. ఒక అబ్బాయి, అమ్మాయి కలసి పారిపోకుండా ఎలా అడ్డుకోగలం?’’అని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ మహదేవన్‌తో కూడిన బెంచ్‌ ఓ సుమోటో కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. పోక్సో అన్నది చిన్నారులపై లైంగిక వేధింపులు, దోపిడీని నిరోధించే చట్టమని స్పష్టం చేస్తూ.. పరస్పర ఇష్టంతో ఏర్పాటు చేసుకునే సన్నిహిత సంబంధాలకు అడ్డుకునేందుకు వినియోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘టీనేజీ అమ్మాయిలు తమ భాగస్వాములతో కలసి పారిపోగానే.. తల్లిదండ్రులు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి, పిల్లల ఇష్టాలను అణచివేయడానికి పోక్సోను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఒకే చోట కలసి చదువుకుంటున్న వారి మధ్య ఆకర్షణ భావాలు ఏర్పడినప్పుడు వాటిని మీరు ఎలా ఆపగలరు? పరస్పర ఇష్టంతో ఏర్పడిన ప్రేమ వ్యవహారాలను నేరాలుగా చితీక్రరించి, అబ్బాయిలను జైలుకు పంపిస్తుండంతో వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాగే, అమ్మాయిల ఇష్టానికి వ్యతిరేకంగా బాధితులుగా చిత్రీకరిస్తుండడం వారికి మనోవేదనను మిగిలిస్తోంది’’అని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 06:04 AM