Share News

కొలీజియం నిర్ణయాలపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:16 PM

న్యాయమూర్తులను నియమించే 'కొలీజియం' వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనుక గల కారణాలను బహిరంగపరచకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.

కొలీజియం నిర్ణయాలపై సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు..
Justice Ujjal Bhuyan

న్యూఢిల్లీ, ఆగస్టు1 : న్యాయమూర్తులను నియమించే 'కొలీజియం' వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనుక గల కారణాలను బహిరంగపరచకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. అర్హత లేని వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. శనివారం ఢిల్లీలో విధి థింక్-ట్యాంక్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్లేటో నుంచి బెంతమ్ వరకు అందరూ చెప్పినట్లు.. కోర్టులలో ఏం జరుగుతోంది? తమ న్యాయమూర్తులు ఎవరు? వారు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు? అని తెలుసుకునే పూర్తి హక్కు దేశ పౌరులకు ఉంది. ఈ సమాచారమంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2023లో సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేసినప్పుడు కొలీజియం చాలా స్పష్టమైన కారణాలను వెల్లడించింది’..


‘అయితే0, సౌరభ్ కిర్పాల్‌ను కొలీజియం సిఫార్సు చేసి మూడేళ్లు గడిచినా ఆయన నియామకం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. కారణాలను వెల్లడించకపోవడం వల్ల సమర్థులైన, నిజాయితీ గల న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుంది. ఎలాంటి అర్హత లేని వ్యక్తులు వ్యవస్థలోకి రావడం వల్ల, వారు భవిష్యత్తులో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఒక వర్గం ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉంది’ అని జస్టిస్ భుయాన్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BPCLలో టెక్నీషియన్ పోస్టులు

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ: మంత్రి పొంగులేటి

Updated Date - Aug 01 , 2026 | 08:23 PM