డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BPCLలో టెక్నీషియన్ పోస్టులు
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:42 PM
డిప్లొమా, బీఈ, బీటెక్ అభ్యర్థులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) శుభవార్త చెప్పింది. ముంబయి, కొచ్చి రిఫైనరీల్లో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ముంబయి, కొచ్చి రిఫైనరీల్లో నాన్-మేనేజ్‌మెంట్ కేటగిరీలో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా, ఆగస్టు 13, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు
ప్రాసెస్ ఆపరేటర్/ఆపరేటర్ (కెమికల్) – 64
ప్రాసెస్ టెక్నీషియన్ (కెమికల్) – 60
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 17
టెక్నీషియన్/ఆపరేటర్ (మెకానికల్) – 13
మొత్తం ఖాళీలు: 154
అర్హతలు
సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులకు అవసరమైన ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి
2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఓబీసీ (ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతభత్యాలు
పోస్టును బట్టి నెలకు రూ.26,500 నుంచి రూ.34,000 వరకు ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు, సంస్థ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి స్కిల్/ప్రొఫిషియెన్సీ టెస్ట్, అనంతరం మెడికల్ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
మొత్తం మార్కులు: 100
పరీక్ష సమయం: 120 నిమిషాలు
నెగెటివ్ మార్కింగ్ లేదు
డొమైన్ నాలెడ్జ్ – 60 మార్కులు
జనరల్ ఆప్టిట్యూడ్ – 40 మార్కులు
ఇంగ్లీష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
లాజికల్ రీజనింగ్
జనరల్ అవేర్‌నెస్
కరెంట్ అఫైర్స్
దరఖాస్తు ఫీజు
జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (ఎన్‌సీఎల్): రూ.590
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: జులై 29, 2026
చివరి తేదీ: ఆగస్టు 13, 2026
CBT పరీక్ష: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
Also Read:
స్వాతంత్ర్యం అంటే అది కాదు! జెన్ జీ నిరసనల నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వ్యాఖ్య
నాయకత్వం నుంచి ప్రేమ వరకు.. ఆగస్టులో పుట్టిన వారి ప్రత్యేక లక్షణాలు ఇవే!