Share News

ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:09 PM

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) ఆ ఐదుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు
Supreme Court judges

న్యూఢిల్లీ, జూన్ 2: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు(మంగళవారం) ఐదుగురు కొత్త న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ శీల్‌ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌, జస్టిస్‌ సంజీవ్‌, జస్టిస్‌ అరుణ్‌పళ్లి, జస్టిస్ వెంకిట సుబ్రమణి జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.


కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్‌ బీవీ నాగరత్న మాత్రమే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉంటూ అదే న్యాయస్థానానికి జడ్జి అయిన వారి సంఖ్య 12కు చేరింది. అయితే, వయసు రీత్యా కొత్త న్యాయమూర్తుల్లో ఎవరూ సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం లేదు.


ఇవి కూడా చదవండి

వడ్డీ పేరుతో భారీ మోసం.. వ్యాపారి ఇంటి ముందు రైతుల ధర్నా

నాడు పోరాటం.. నేడు బతుకు ఆరాటం

Updated Date - Jun 02 , 2026 | 12:40 PM