ఇకపై జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నిరసనలు బంద్?
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:53 PM
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిరసనల నిర్వహణకు జంతర్ మంతర్ సరైన ప్రదేశం కాదంటూ సతీష్ చంద్ కౌశిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిరసనల నిర్వహణకు జంతర్ మంతర్ సరైన ప్రదేశం కాదంటూ సతీష్ చంద్ కౌశిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల కారణంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. నిత్యావసర వస్తువుల సరఫరాకు, వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని సతీష్ చంద్ కౌశిక్ కోర్టుకు వివరించారు. ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు నిరసనలకు ప్రత్యామ్నాయ వేదిక కేటాయింపుపై కేంద్రాన్ని సంప్రదించాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించింది.
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: ఏకంగా 8 స్వర్ణాలు.. భారత్ పతక వేటలో మహిళలదే ఆధిపత్యం
అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి