భోజశాల తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:49 AM
వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ సరస్వతి దేవాలయమంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ...
న్యూఢిల్లీ, జూలై 13: వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ సరస్వతి దేవాలయమంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరగా విచారణ జరిగేలా చూస్తామని పిటిషన్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ధార్ జిల్లాలోని 11 శతాబ్దానికి చెందిన వివాదాస్పద భోజశాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ సరస్వతీదేవి మందిరమని పేర్కొంటూ ఈ ఏడాది మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News