ఓటుకు నోటు కేసు విచారణ 25కు వాయిదా
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:17 AM
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు చెల్లదని 2021 జూలై 22న సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో తన పేరునూ తొలగించాలని కోరుతూ 13 ఏప్రిల్ 2021న సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇవి మరోసారి మంగళవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం విజ్ఞప్తితో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా