Share News

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

ABN , Publish Date - Aug 13 , 2026 | 03:05 PM

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..
Sukhbir Singh Badal Attacked in Nanded, Rushed to Hospital

నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.


కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ తోపాటు, భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం

హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

Updated Date - Aug 13 , 2026 | 03:46 PM