Share News

మరింత బలపడుతున్న ఎల్‌నినో!

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:21 AM

ఎల్‌నినో మరింత బలపడుతోంది. 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎన్‌ఓఏఏ...

మరింత బలపడుతున్న ఎల్‌నినో!

  • మార్చి వరకు కొనసాగే అవకాశం

  • 1950 తర్వాత అత్యంత బలమైనది: ఎన్‌ఓఏఏ

న్యూఢిల్లీ, నవంబరు 14: ఎల్‌నినో మరింత బలపడుతోంది. 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎన్‌ఓఏఏ(నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ర్టేషన్‌) తాజాగా వెల్లడించింది. ఎల్‌నినో బలపడుతూనే ఉం దని, 1950 తర్వాత ఇదే అత్యంత బలమైనదిగా రికార్డులకు ఎక్కనుందని తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో భూమధ్య రేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత లు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో గతంలోని అన్ని రికార్డులనూ బద్దలుకొట్టనున్నట్టు ఎన్‌ఓఏఏ తెలిపిం ది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాత పరిస్థితులను ఎల్‌నినో మార్చేస్తోంది. ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు పెరుగుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 03:21 AM