Share News

విజయ్‌ సర్కారు ఏర్పాటైతే

ABN , Publish Date - May 08 , 2026 | 06:00 AM

టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ఆరు నెలల వరకు అడ్డుకోబోమని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు....

విజయ్‌ సర్కారు ఏర్పాటైతే

6 నెలల వరకు అడ్డుకోం! సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం

6 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ అమలు చేస్తారని అనుకోవడం లేదు

మహిళలకు రూ.2500 చొప్పున ఇవ్వడం చాలా కష్టం

మాలాగా వెయ్యి ఇచ్చినా చాలు: స్టాలిన్‌

చెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ఆరు నెలల వరకు అడ్డుకోబోమని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. తమిళనాట రాజ్యాంగ సంక్షోభం రాకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గురువారం ఆయన కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడారు. ‘‘టీవీకే ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చగలదో వేచిచూస్తాం. పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి. మహిళలకు నెలనెలా రూ.2,500 ఇస్తామన్న విజయ్‌ హామీ అమలు చాలా కష్టం. కనీసం మేం ఇచ్చినట్లుగా రూ.1000 పంపిణీ కొనసాగించాలి. టీవీకే ప్రకటించిన ఏటా ఆరు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకం అమలు చేయగలరని నేనైతే భావించడంలేదు. ఒకవేళ అమలు చేయగలిగితే సంతోషిస్తాం’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 06:00 AM