జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Mar 28 , 2026 | 09:03 AM
జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
శ్రీనగర్-లేహ్ హైవేపై ఉన్న జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా విరుచుకుపడిన మంచు చరియల కింద అనేక వాహనాలు పూడుకుపోయాయి. రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఊహించని విధంగా మంచు గడ్డల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ప్రమాద స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..
ఘోరం.. ప్రియుడి కోసం కన్న తండ్రినే చంపిన మహిళా పోలీస్..