రాజ్యసభకు విజయ్ జ్యోతిషుడు రాధాన్?
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:55 AM
తమిళనాడు సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిషుడు రాధాన్ పండిట్‌ను రాజ్యసభకు పంపించాలని యోచిస్తున్నట్లు తెలిసింది....
చెన్నై, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిషుడు రాధాన్ పండిట్‌ను రాజ్యసభకు పంపించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం రాజ్యసభను వీడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధాన్‌ను రాజ్యసభకు పంపించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలిసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రాధాన్ పండిట్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విజయ్.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పండిట్‌ను ఎగువసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. టీవీకేకు అసెంబ్లీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మిత్రపక్షాలతో కలిపి అధికార కూటమి సంఖ్య 121గా ఉంది. దీంతో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం