దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల వాటా తగ్గదు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:59 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తిని కొనసాగించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు.
ఇప్పుడున్న నిష్పత్తే కొనసాగుతుంది: మేఘ్వాల్
న్యూఢిల్లీ, నవంబరు 28: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తిని కొనసాగించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు యథాతథంగానే ఉంటుందని వెల్లడించారు. దక్షిణాది అయినా.. ఉత్తరాది అయినా ప్రతి రాష్ట్రానికీ దాని సొంత ప్రాముఖ్యత ఉందని.. అభివృద్ధి పురోగమిస్తున్న కొద్దీ ప్రాతినిధ్యం సమతుల్యంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత సీట్లు, పెరగబోయే సీట్ల పూర్తి వివరాలకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను పంచుకున్నారు. ఆమేరకు ప్రస్తుతం లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో ఐదు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళంకు కలిపి 129 (23.76శాతం) సీట్లుంటే.. పునర్విభజన తర్వాత మొత్తం సీట్లు 816కి పెరిగి దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య కూడా 195 (23.90శాతం)కి పెరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం