Share News

నా పుస్తకం విడుదలయ్యాక రచ్చ తప్పదేమో!

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:14 AM

రాజీవ్‌ గాంధీ ప్రధాని కావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన భార్య, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు

నా పుస్తకం విడుదలయ్యాక   రచ్చ తప్పదేమో!
soniagandhi

  • రాజీవ్‌ ప్రధాని కావడం నాకిష్టం లేదు

  • ఇతరులు నా గురించి ఏవేవో రాశారు

  • నా జీవిత కథను నేనే చెప్పాల్సిన సమయం వచ్చింది

  • కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 27: రాజీవ్‌ గాంధీ ప్రధాని కావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన భార్య, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు. తన జీవితంపై ఇన్నాళ్లూ ఇతరులు అనేక విషయాలు రాశారని, వాటిలో కొన్ని వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, మరికొన్ని అతిశయోక్తులు ఉన్నాయని తెలిపారు. ఇక తన జీవిత కథను తానే చెప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. తన జ్ఞాపకాలతో రాసిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం విడుదలైన తర్వాత పెద్ద చర్చ, రచ్చ జరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తన పుస్తకం గురించి తాజాగా సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. పుస్తకం చదివిన తర్వాత కొందరికి తనపై ఉన్న అభిప్రాయం మారవచ్చన్నారు. మరికొందరి అభిప్రాయం ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు సహజమని అన్నారు. 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన అనంతరం రాజీవ్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 1991లో ఎన్నికల ప్రచారంలో రాజీవ్‌ హత్యకు గురయ్యారు. ఆయన రాజకీయాల్లోకి రావడం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం తమ కుటుంబంలో కీలక పరిణామాలని సోనియా అన్నారు. కాగా, సోనియా రాసిన ఈ 544 పేజీల పుస్తకం నవంబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Sonia-Gandhi-2.jpg

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 04:45 AM