సోనియా ఆత్మకథపై రగడ
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:35 AM
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గ్రంథం విడుదల కాకముందే రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా...
భారత్‌లో ఆ గ్రంథాన్ని ప్రచురించటం లేదన్న పెంగ్విన్ కంపెనీ.. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లేనని కాంగ్రెస్ ఆరోపణ
‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో ఆత్మకథ రాసిన సోనియాగాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గ్రంథం విడుదల కాకముందే రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచురించే హక్కులు పొందిన పెంగ్విన్ రాండమ్ హౌస్ సంస్థ.. భారత్‌లో మాత్రం దానిని తాము ప్రచురించటం లేదని ప్రకటించింది. ఈ పుస్తకం వచ్చే నవంబరు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని పెంగ్విన్ రాండమ్ హౌస్‌కుఅమెరికాలో అనుబంధ పబ్లిషర్ అయిన ఆల్ర్ఫెడ్ ఏ నాఫ్ ఈ నెల మొదట్లో ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ వాదులు, సోనియా అభిమానులు ఆ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారందరికీ షాక్ ఇస్తూ భారత్‌లో తాము ఆ గ్రంఽథాన్ని ప్రచురించటం లేదని ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ సంస్థ శుక్రవారం ప్రకటించింది. పుస్తకంలో కొన్నిచోట్ల తాము సూచించిన మార్పులు చేసేందుకు రచయిత (సోనియాగాంధీ) అంగీకరించలేదని, అందువల్లే భారత్‌లో ఆ గ్రంథం ప్రచురణ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ‘గ్రంథంలోని అంశాల వాస్తవికతను పరిశీలించి రచయితకు పలు సూచనలు ఇవ్వటం పబ్లిషర్‌గా మా బాధ్యత. ప్రచురణ ప్రక్రియలో ఇది సాధారణ అంశం’ అని పేర్కొంది
భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ
పెంగ్విన్ సంస్థ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను ఆ సంస్థ చంపేసిందని కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు. ‘సోనియాగాంధీ ఆత ్మకథ గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచురించేందుకు పెంగ్విన్ రాండమ్ కంపెనీ సిద్ధంగా ఉంది. కానీ, భారత్‌లో దాని అనుబంధ సంస్థ అయిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా మాత్రం ఆ గ్రంథంలో మార్పులు చేయాలని కోరుతోంది. అందుకు కారణమేంటి? ఆ సంస్థ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గింది? త్యాగం, నిబద్ధతకు సోనియాగాంధీ జీవితం ఉదాహరణ. దేశానికి ఆమె అసాధారణ సేవ చేశారు. అలాంటి గొప్ప నాయకురాలి ఆత్మకథను రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రచురించకుండా తప్పుకోవటం భావప్రకటనా స్వేచ్ఛను హత్యచేయటమే. నరేంద్రమోదీ పాలనలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించటం, మోదీ పాలన, ఆరెస్సెస్ కు సంబంధించి ఎడిటోరియల్‌లోని అంశాలను తొలగించాలని పెంగ్విన్ ఇండియా కోరింది. ఆ అంశాలను తొలగించేలా చూడాలని మోదీ ప్రభుత్వం పబ్లిషర్‌పై ఒత్తిడి తెచ్చిందా?’ అని గెహ్లోత్ ప్రశ్నించారు. పెంగ్విన్ సంస్థ నిర్ణయం ఆందోళనకరమని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఆరెస్సె్‌సపై గ్రంథాలు ప్రచురించిన పెంగ్విన్ సంస్థ.. సోనియా ఆత్మకథ ప్రచురణ నుంచి తప్పుకోవటానికి చూపిన కారణం బలంగా లేదని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సోనియాగాంధీ తన జ్ఞాపకాలు, అనుభవాలను పుస్తక రూపంలో తెస్తున్నప్పుడు.. వాటిలో కొన్ని కల్పనలు కూడా ఉండవచ్చు కదా? అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ప్రశ్నించారు. వాటిని సరిచూసుకోవాలని పబ్లిషర్ చెప్పటంలో తప్పేముందని నిలదీశారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు