Share News

పుస్తక రూపంలో సోనియా ఆత్మకథ

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:44 AM

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథ(జీవిత చరిత్ర)ను పుస్తక రూపంలో పాఠకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో ఈ పుస్తకం...

పుస్తక రూపంలో సోనియా ఆత్మకథ

  • నవంబర్‌ 10న విడుదల కానున్న పుస్తకం

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 18: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథ(జీవిత చరిత్ర)ను పుస్తక రూపంలో పాఠకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో ఈ పుస్తకం నవంబర్‌ 10న విడుదల కానున్నట్టు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆల్ర్ఫెడ్‌ ఏ.నాఫ్‌ (పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌) ప్రకటించింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జీవిత భాగస్వామిగా, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతగానే సోనియాగాంధీ చాలా మందికి తెలుసు. చదువుకునే రోజుల్లో రాజీవ్‌తో ప్రేమాణం, పెళ్లి, భారత్‌కు రావడం, ఇలా తన జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలను ఈ పుస్తకం రూపంలో సోనియా పంచుకోబోతున్నారు. రాజీవ్‌తో ప్రేమ, పెళ్లి, భారత్‌కు రావడం వంటి విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 1984లో తన అత్త, ప్రధాని ఇందిర హత్య.. ఆ తర్వాత ఏడేళ్లకే (1991లో) తన భర్త రాజీవ్‌గాంధీ హత్య తదితర తీవ్ర విషాదాలు తన జీవితాన్ని ఎలా మార్చాయో సోనియా వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 07:02 AM