బర్గర్ తిన్నందుకు సీజేపీ అధికారప్రతినిధిపై వేటు
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:42 AM
‘పార్లమెంట్ మార్చ్’ కొనసాగుతున్న సమయంలో తీరికగా బర్గర్ తిన్నందుకు సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా వేటుకు గురయ్యారు. సోమవారం...
న్యూఢిల్లీ, జూలై 21: ‘పార్లమెంట్ మార్చ్’ కొనసాగుతున్న సమయంలో తీరికగా బర్గర్ తిన్నందుకు సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా వేటుకు గురయ్యారు. సోమవారం చలో సంసద్ సమయంలో జంతర్‌మంతర్ సమీపంలోని ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో దహియా బర్గర్ తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సీజేపీ మద్దతుదారులు మండిపడ్డారు. దీంతో దహియా తీరును ఆక్షేపిస్తూ, ఆయన్ను పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది. ‘ఆకలివేసే బర్గర్ తిన్నాను. దీన్ని ఇంత రాద్దాంతం చేయడం ఎందుకు’ అని దహియా విమర్శలకు బదులిచ్చారు. రెండు రాత్రులు నిద్ర లేకుండా క్షేత్రస్థాయిలో పడ్డ కష్టాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!