నీలేకని కుటుంబానికి సర్ నోటీసులు..!
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:02 AM
కర్ణాటకలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పలువురు ప్రముఖల పేర్లు నోటీసులు ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన...
జిరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్,
పద్మశ్రీ గ్రహీత హరేకాల హజబ్బాకూ కూడా..
బెంగళూరు, సెప్టెంబరు 10: కర్ణాటకలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పలువురు ప్రముఖల పేర్లు నోటీసులు ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన కుటుంబ సభ్యులు.. జిరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లు నోటీసులు అందుకునే అవకాశం కనిపిస్తోంది. 2002 ఓటర్ల జాబితాకు, తాజా ఓటర్ల జాబితాకు మధ్య వ్యత్యాసాలు ఉన్నా, లేదా నాటి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా నిబంధనల ప్రకారం వ్యత్యాసాల జాబితాలో పెడుతున్నారు. నీలేకని, ఆయన భార్య రోహిణి, ఇద్దరు పిల్లలు.. జాన్వీ, నిహార్‌ల పేర్లు గత ‘సర్‘తో మ్యాపింగ్ కాని జాబితాలో ఉన్నాయి. ఈ వ్యత్యాసాల జాబితాలో భారతరత్న పురస్కార గ్రహీత సీఎన్‌ఆర్ రావు, పద్మశ్రీ గ్రహీత హరేకాల హజబ్బా కూడా ఉన్నట్లు సమాచారం. అయితే సీఎన్‌ఆర్ రావు కు నోటీసు ఇవ్వలేదని ఇప్పటికే ఈసీ అధికారులు స్పష్టం చేయగా.. హజబ్బాకు పేరు సరిపోలలేదంటూ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..