దారుణం.. ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..
ABN , Publish Date - May 16 , 2026 | 03:58 PM
గుజరాత్‌లో అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు.
అహ్మదాబాద్: అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన బాధిత కుటుంబం మోర్బికి వలస వెళ్లింది. ఓ ఇంట్లో నెలకు రూ.2 వేలతో అద్దెకు దిగింది. భార్య, కుమార్తెతో కలిసి కుటుంబ యజమాని చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొన్ని నెలలుగా వారిని తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కుటుంబాన్ని పోషించడానికి కూడా డబ్బులు లేకుంగా పోయాయి. మరోవైపు నాలుగు నెలల ఇంటి అద్దె బకాయి పడ్డారు. వారి ఆర్థిక సమస్యలను ఇంటి యజమాని ఆసరాగా చేసుకున్నాడు. డబ్బులకు బదులుగా అద్దెకు ఉంటున్న వ్యక్తి భార్య, కుమార్తెపై లైంగిక వేధింపులు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయాన్ని కిరాయికి ఉంటున్న వ్యక్తికి చెప్పి ఒప్పించాడు. అనంతరం మహిళ, బాలికపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ తన తల్లికి విషయం తెలియజేసింది. దీంతో ఆమె మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఇంటి యజమాని, మహిళ భర్తపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జె.ఎం.లాల్ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను అలసిపోనివ్వదు: ప్రధాని మోదీ..
లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు