Share News

బీజేపీకి షెహజాద్ పూనావాలా మరోసారి రాజీనామా లేఖ.. ఆమోదించాలని విజ్ఞప్తి..

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:52 AM

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి పార్టీకి రాజీనామా లేఖ సమర్పించారు. గతంలో ఆయన పంపిన రాజీనామా లేఖను బీజేపీ తిరస్కరించింది.

బీజేపీకి షెహజాద్ పూనావాలా మరోసారి రాజీనామా లేఖ.. ఆమోదించాలని విజ్ఞప్తి..
Shehzad Poonawalla

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి పార్టీకి రాజీనామా లేఖ సమర్పించారు. గతంలో ఆయన పంపిన రాజీనామా లేఖను బీజేపీ తిరస్కరించింది. అయినప్పటికీ తాజాగా మరోసారి రాజీనామా లేఖను పంపించి ఆమోదించాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు (Shehzad Poonawalla resignation).


షెహజాద్ పూనావాలా గతంలో బీజేపీ నాయకత్వానికి తన రాజీనామాను సమర్పించారు. అయితే పార్టీ తన రాజీనామాను అంగీకరించకుండా, పునరాలోచించుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. తాజాగా మరోసారి లేఖ రాశారు. పార్టీ తన రాజీనామాను ఆమోదించి, జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి కూడా తనను రిలీవ్ చేయాలని కోరారు (BJP resignation).


పార్టీ నుంచి వైదొలగడానికి తీవ్రమైన ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితులే ప్రధాన కారణాలని పూనావాలా పేర్కొన్నారు (Shehzad Poonawalla BJP). ఇకపై ప్రైవేట్ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ పరిణామాలకు కారణమైన వ్యక్తుల పేర్లను తాజా లేఖలో వెల్లడించలేదు. పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి తన మద్దతు కొనసాగుతుందని పూనావాలా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 17 , 2026 | 11:52 AM