Share News

అనవసరంగా రుద్దుతున్నారు!

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:53 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో...

అనవసరంగా రుద్దుతున్నారు!

  • వందేమాతరం పూర్తిగా ఆలపించాలనడంపై శశి థరూర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 2: ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించాల్సిన అవసరం ఉందా?.’’ అని ప్రశ్నించారు. ఇలా చేయడం.. వందేమాతరాన్ని అనవసరంగా రుద్దడమేనని అభిప్రాయపడ్డారు. వందేమాతరం గేయాన్ని గౌరవించే విషయంలో గందరగోళం సరికాదని.. ప్రతి కార్యక్రమంలో ఆలపించాలన్న నిబంధన కూడా సరికాదని వ్యాఖ్యానించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించే విషయంపై పార్లమెంటు ఎలాంటి చట్టం చేయలేదని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్న ఓ కార్యక్రమంలో వందేమాతరం పూర్తి గేయాన్ని రెండు సార్లు ఆలపించారని.. దీంతో కార్యక్రమానికి వచ్చిన వారు అంతసేపు నిలబడలేక అసౌకర్యానికి గురయ్యారని థరూర్‌ వివరించారు. థరూర్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీపై ముస్లిం లీగ్‌ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:53 AM