డ్రగ్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అరెస్ట్
ABN , Publish Date - Aug 23 , 2026 | 07:04 PM
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు రోహుల్లా మెహదీ అరెస్ట్ అయ్యారు. ఆయన వద్ద నుంచి సుమారు రూ. 5.60 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు రోహుల్లా మెహదీ అరెస్ట్ అయ్యారు. ఆయన వద్ద నుంచి సుమారు రూ. 5.60 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు స్నాప్‌చాట్, వాట్సాప్ ద్వారా ముంబైలో ఓ పెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్ నడుస్తోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పక్కా ప్లాన్ వేశారు.
ఓ పోలీసు అధికారి కస్టమర్‌లా మారి డ్రగ్స్ డీలర్లను సంప్రదించాడు. కాసిఫ్ అనే వ్యక్తి దహిసర్ చెక్ నాకా సమీపంలోని ఠాకూర్ మాల్ వద్దకు 28 గ్రాముల ఎండీ డ్రగ్స్ డెలివరీ చేయడానికి వచ్చాడు. డ్రగ్స్ డీల్ జరుగుతుండగా పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన కాసిఫ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ఈ డ్రగ్స్ వ్యవహారంలో నటుడు రోహుల్లా మెహదీ ప్రమేయం ఉందని చెప్పాడు.
కాసిఫ్ ఇచ్చిన సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముంబై మలద్‌లోని షూటింగ్‌లో ఉన్న రోహుల్లా మెహదీని అరెస్ట్ చేశారు. మెహదీని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతడికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ నెట్‌వర్క్‌లో బాలీవుడ్‌కు చెందిన ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో డీసీపీ రాహుల్ చవాన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
దులీప్ ట్రోఫీ: సుదీప్, షాబాజ్ సెంచరీలు.. విఫలమైన వైభవ్!
విజయనగరం జిల్లాలో పోలీస్ వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి