మా ఇంట్లో వారిని పోలీసులు భయపెట్టారు
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:35 AM
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ కుటుంబ సభ్యులు నివసించే ఇంటికి గురువారం అక్కడి పోలీసులు వెళ్లి భయపెట్టారని కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు...
సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపణ
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ కుటుంబ సభ్యులు నివసించే ఇంటికి గురువారం అక్కడి పోలీసులు వెళ్లి భయపెట్టారని కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. పలు ప్రశ్నలు వేసి వేధించారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఏ కారణంతో వచ్చారు? ఎవరు ఆదేశించారు? ఇది చట్టబద్ధమైన విధానమేనా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పుదుచ్చేరి ప్రభుత్వం తన కుటుంబ సభ్యులను వేధిస్తోందని ఆరోపించారు. తన నోరు మూయుంచడానికే ఇలా చేయాలని అనుకుంటే అది జరగని పని అని స్పష్టం చేశారు. పోలీసులు చట్టాన్ని అమలు చేయాలే తప్ప గూండాల్లా వ్యవహరించకూడదని కోరారు. రెండు రోజుల క్రితం అమిత్ షా పుదుచ్చేరి వెళ్లారని, అక్కడి హోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌లను కలిశారని తెలిపారు. కాగా, దీనిపై పుదుచ్చేరి ప్రభుత్వం స్పందిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పురస్కరించుకొని చేస్తున్న రొటీన్ తనిఖీల్లో భాగంగా అక్కడికి వెళ్లినట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..