సౌదీ పోర్టు నుంచి ఎరువులు.!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:39 AM
గల్ఫ్, హోర్ముజ్ జలసంధి అనగానే మనకు గుర్తువచ్చేది ఆయిల్, గ్యాస్. ఆ రెండే కాకుండా మన దేశానికి కావాల్సిన ఎరువుల్లో ఎక్కువ శాతం అక్కడి నుంచే సరఫరా అవుతుంది....
హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయంగా ఎర్రసముద్రం ద్వారా భారత్‌కు రవాణా
న్యూఢిల్లీ, జూన్ 2: గల్ఫ్, హోర్ముజ్ జలసంధి అనగానే మనకు గుర్తువచ్చేది ఆయిల్, గ్యాస్. ఆ రెండే కాకుండా మన దేశానికి కావాల్సిన ఎరువుల్లో ఎక్కువ శాతం అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో పశ్చిమాసియా నుంచి వాటిని ఎలా తీసుకురావాలి అనేది ప్రభుత్వానికి సవాల్‌గా నిలుస్తోంది. అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ ప్రకారం సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ కలిసి భారత్ ఎరువుల దిగుమతుల్లో 37ు వాటా కలిగి ఉన్నాయి. రెడీ మేడ్ నత్రజని ఎరువులే కాకుండా, మన దేశంలో తయారయ్యే ఎరువుల కోసం అవసరమయ్యే సల్ఫర్, ఎల్‌ఎన్జీ కూడా పశ్చిమాసియా నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయంపై భారత్ ముందే సిద్ధమైంది. ఎర్రసముద్రం తీరంలోని సౌదీ అరేబియాకు చెందిన యాంబు పోర్టు ప్రాంతీయ సముద్ర వాణిజ్యంలో కీలకపాత్ర పోషించబోతోందని మార్చి 14న సౌదీలోని భారత్ ఎంబసీ ఎక్స్‌లో పోస్టు చేసింది. యాంబు పోర్టును భారత అధికారులు సందర్శించి అక్కడి నిర్వహణ, రోడ్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కూడా పరిశీలించారు. ఇప్పుడు హోర్ముజ్‌పై ఆధారపడకుండా ఈ పోర్టు ద్వారా ఎరువుల సరఫరా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన ఎరువులను యాంబుకు పంపుతారు. సుమారు 1200 కి.మీ. రోడ్డు మార్గం ద్వారా తరలించి ఎర్రసముద్రం తీరంలోని యాంబులో నౌకల్లోకి ఎగుమతి చేస్తారు. ఎర్రసముద్రం, అరేబియా సముద్రం మీదుగా ఆ నౌకలు భారత్‌కు చేరతాయి.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News