Share News

ఆరేళ్లు జైల్లో ఉన్నా మరాఠీ నేర్చుకోలేదు

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:42 AM

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మరాఠీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరాఠీలో మాట్లాడాలని కొందరు అడగ్గా....

ఆరేళ్లు జైల్లో ఉన్నా మరాఠీ నేర్చుకోలేదు

  • ‘మరాఠీ తప్పనిసరి’ వివాదం నేపథ్యంలో సంజయ్‌ దత్‌ వ్యాఖ్య

ముంబై, సెప్టెంబరు 8: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మరాఠీపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరాఠీలో మాట్లాడాలని కొందరు అడగ్గా.. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా మరాఠీ నేర్చుకోలేదని చెప్పారు. సంజయ్‌దత్‌ మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌తో కలిసి ఆదివారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ను మరాఠీలో మాట్లాడాలని కొందరు కోరారు. దీనికి ఆయన నవ్వుతూ.. తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ప్రతాప్‌ భాయ్‌.. నేను పుణెలోని ఎరవాడ జైలులో ఏకంగా ఆరేళ్లు ఉన్నాను. అయినా సరే మరాఠీ నేర్చుకోలేకపోయాను’’ అంటూ సరదాగా తప్పించుకున్నారు. సర్నాయక్‌ మహారాష్ట్రలోని ట్యాక్సీ డ్రైవర్లు ఆగస్టు 15లోగా మరాఠీ నేర్చుకోవాలని ఇటీవల గడువు విధించడం గమనార్హం. ఆయన ముందే సంజయ్‌ దత్‌ మరాఠీ రాదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్‌దత్‌ వ్యాఖ్యలపై ఎరవాడ జైలు మాజీ సూపరింటెండెంట్‌ డీఐజీ స్వాతి సాఠే స్పందించారు. సంజయ్‌ దత్‌ జైల్లో మరాఠీ నేర్చుకోకపోయినా.. ‘భయం’ భాషను మాత్రం బాగా నేర్చుకున్నారన్నారు. మొదటిసారి జైలుకు వచ్చినప్పుడు ఖైదీ దుస్తులు ధరించేందుకు సంజయ్‌ నిరాకరించారని, గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాక వేసుకున్నారని ఆమె వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 05:42 AM