Share News

క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: జై శంకర్

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:03 PM

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.

క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: జై శంకర్
S Jaishankar

న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. గల్ఫ్ దేశాలు భారత్‌‌కి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి’..


‘గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు భారతీయుల కోసం ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ పరిస్థితిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశాం. టెహ్రాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. భారత విమానయాన సంస్థలు భారత ప్రజలను వెనక్కి తీసుకువస్తున్నాయి. భారత్ రావాలనుకునేవారికి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దోహా, జోర్డాన్‌లో ఉన్నవారికి సాయం అందజేస్తున్నాం ఇరాన్‌లో పరిస్థితులపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడాను’ అని అన్నారు.


దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం

క్రూడ్ ఆయిల్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి కేంద్ర మంత్రి జై శంకర్ చెక్ పెట్టారు. క్రూడ్ ఆయిల్ కోసం దేశ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. ‘భారతీయుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ సర్వోన్నతంగా ఉంటాయి’ అని అన్నారు. దేశంలోని చమురు నిల్వలపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో జై శంకర్ మాట్లాడుతూ.. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ మొదలైన వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకల్లో దాదాపు 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలున్నాయని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..

లిక్కర్ పాలసీ కేసు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే

Updated Date - Mar 09 , 2026 | 12:26 PM