Share News

భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది, పాక్‌లా దళారీ దేశం కాదు: జైశంకర్

ABN , Publish Date - Mar 25 , 2026 | 09:13 PM

పాకిస్థాన్‌ను 'దళారీ' దేశంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభివర్ణించారు. పాకిస్థాన్‌లాగా భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వం నెరపే దేశం, దళారీ దేశం కాదని అన్నారు.

 భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది, పాక్‌లా దళారీ దేశం కాదు: జైశంకర్
S Jaishankar

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ను 'దళారీ' దేశంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభివర్ణించారు. పాకిస్థాన్‌లాగా భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వం నెరపే దేశం, దళారీ దేశం కాదని అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతలపై కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.


పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేలా వాషింగ్టన్-టెహ్రాన్‌తో మధ్వవర్తిత్వం వహించేందుకు పాక్ ముందుకు రావడంపై అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ, పాకిస్థాన్‌ దళారీ దేశమని అన్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ దళారీ దేశంగా వ్యవహరించదని చెప్పారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడంతో మధ్యవర్తిత్వం వహించడానికి పాక్ ఉత్సాహం కనబరుస్తోంది. చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఎందుకు మౌనంగా ఉందని విపక్షాలు ప్రశ్నించినప్పుడు, భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉందని, ఎన్నడూ దళారీ దేశంగా వ్యవహరించదని జైశంకర్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 25 , 2026 | 09:27 PM