Share News

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ 57లను ఇస్తాం

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:23 AM

తమ అత్యాధునిక సుఖోయ్‌ ఎస్‌యూ-57 స్టెల్త్‌ యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు....

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ 57లను ఇస్తాం

  • వాటిని భారత్‌లో తయారుచేసేందుకూ సిద్ధమే: పుతిన్‌

మాస్కో, జూన్‌ 5: తమ అత్యాధునిక సుఖోయ్‌ ఎస్‌యూ-57 స్టెల్త్‌ యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. భారత్‌ కోరితే ఈ ఐదోతరం యుద్ధ విమానాలను భారత్‌లోనే సంయుక్తంగా తయారు చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. గురువారం రాత్రి ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘ఈ యుద్ధవిమానాలను కలిసి తయారు చేద్ధామని భారత్‌లోని మా మిత్రులకు సూచించాం. వాళ్లు ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు’ అని వెల్లడించారు. స్టెల్త్‌ యుద్ధ విమానాన్ని సొంతంగా తయారుచేసేందుకు మనదేశం చేపట్టిన ఏఎంసీఏ ప్రాజెక్టు 2035 దాకా పూర్తయ్యే అవకాశం లేనందున.. రష్యా నుంచి కనీసం రెండు స్క్వాడ్రన్ల (36 విమానాలు) ఎస్‌యూ-57 ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, భారత వాయుసేన రఫేల్‌ యుద్ధ విమానాలవైపు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. కాగా, భారత్‌-చైనా మధ్య సరిహద్దు సహా పలు అంశాలపై ఉన్న సున్నితమైన వివాదాల్లో తాము జోక్యం చేసుకోబోమని పుతిన్‌ తెలిపారు. సమస్యలను మోదీ, జిన్‌పింగ్‌ కలిసి పరిష్కరించుకోగలరని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 05:23 AM