Share News

రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం.. స్వీట్లలో హోలీ రంగులు!

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:44 PM

పశ్చిమ బెంగాల్‌లో ఆహార భద్రతపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతాలోని రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, స్వీట్‌ షాపుల్లో కుళ్లిన మాంసం, పాడైన రొయ్యలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు.

రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం.. స్వీట్లలో హోలీ రంగులు!
West Bengal Food Safety Raids

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఆహార భద్రతపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతాలోని ప్రముఖ రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, స్వీట్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా.. కిలోల కొద్దీ కుళ్లిపోయిన, బూజు పట్టిన మాంసంతో పాటు పాడైపోయిన రొయ్యలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఆహార పదార్థాల్లో, స్వీట్‌ షాపులు, బేకరీల్లోనూ మిఠాయిలకు హోలీ రంగును ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


మహారాష్ట్రలో ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఐఏఎస్‌ అధికారి తుకారాం ముండే ప్రభావంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆహార సంస్థలపై తనిఖీలు పెరిగినట్లు తెలుస్తోంది. తుకారాం ముండే.. రెండు నెలల క్రితం మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు, గిడ్డంగులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.

Untitled-2.jpg

ఇదే సమయంలో బెంగాల్‌లోనూ గత మూడు రోజులుగా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగకు మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో ఈ తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పండుగ సమయంలో రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

Untitled-1.jpg

దసరా పండుగకు ముందు తనిఖీలు

బెంగాల్‌లో సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆహార నాణ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని న్యూ మార్కెట్‌ ప్రాంతంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి సువెందు అధికారి.. ఆహార కల్తీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్లు, హోటళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.


Also Read:

కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్థమాన్..

రాహుల్‌ పౌరసత్వ పిటిషన్‌ కొట్టివేత

Updated Date - Sep 03 , 2026 | 02:05 PM